మొత్తానికి చాలా మీటింగ్స్ తరవాత చైనా సైనికులు భారత దేశ భూ భాగం నుంచే కాకుండా ఏకంగా ఇండియా-చైనా బోర్డర్ నుంచే వైదొలుగుతున్నారు. దీన్ని ALZAZEERA న్యూస్ ఛానల్ కన్ఫర్మ్ చేసింది. దాదాపు 10 ఆర్మీ మేజర్ లెవెల్ మీటింగ్స్ తరవాత కూడా వెనకడుగు వెయ్యని చైనా ఆర్మీ భారత దేశ ప్రధాని ఒక్కసారి లఢక్ సరిహద్దు కి వెళ్లి రాగానే తగ్గాలని డిసైడ్ అయ్యింది. దీనికి కారణం మన ప్రధాని అయినా వెనక ఉండి నడిపించింది మాత్రం భారత రక్షణ సహాయకదారుడు అజిత్ దోవల్.
ఈ రోజు ఉదయం 11 గంటలకి దోవల్ గారు చైనా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో భాగంగా ఇరు దేశాలు ఎవరి భూ భాగం లో కి వారు వెళ్తే పరిస్థితి స్థిమితం గా ఉంటుంది అని లేదా భారత్ తాను మాత్రం చైనా కుయుక్తులకు తగ్గే ప్రసక్తి లేదు అని స్పష్టం చేసినట్లు ANI న్యూస్ ద్వారా ఒక ప్రకటన వెలువడింది.
ఆలా ప్రకటన వచ్చిందో లేదో ఇదే రోజు సాయంత్రం 5 గంటలకి ALZAZEERA న్యూస్ ప్రకటన రావడం గమనార్హం. వారి ప్రకారం satillite ఇమేజెస్ ప్రకారం చైనా ఆర్మీ గాల్వాన్ లోయకి అటు వైపు వేసిన టెంట్లు వారి ఆర్మీ ట్యాంక్లు, తీసేసి వేణు దిరిగుతున్నాయ్ అని ప్రకటించారు. దీనితో చైనా – భారత్ బోర్డర్ సమస్య పూర్తి గ ముగిసినట్లే అనే అనుకోవచ్చు. ఇదే విషయాన్నీ 4 గంటల సమయం లో చైనా ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రి ట్విట్టర్ వేదికగా ఇరు దేశాలు మాటల ద్వారా నే సమస్య ని పరిష్కరించుకుంటున్నాం అని కూడా ప్రకటించారు.
ఉరి ఎటాక్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్ వంటి ఎన్నో వ్యూహాల వెనక ఉండే అజిత్ దోవల్ ఈ సారి కూడా చైనా ఇష్యూ ని తన చేతితో నే ముగించారు అనే వార్తలు వస్తున్నాయి.