Friday, September 13, 2024

Top 5 This Week

Related Posts

వ్యవసాయం వైపు యువత అడుగులు

కరోనా కారణం గా పట్నాలు ఖాళీ అయిపోతేన్నాయి. చాలా మంది జాబ్స్ పోయి హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలూ వొదిలేసి తమ గ్రామాలకి చేరుకుంటున్నారు. ఈ పరిస్థితి సెట్ అవ్వడానికి ఇంకొక 6-7 నెలలు పెట్టె అవకాశం ఉండడం తో హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో జాబ్ సెర్చ్ కోసం వెళ్లిన వాళ్ళు తిరిగి తమ సొంత ఉళ్ల కి చేరుకుంటున్నారు. ఒక రకంగా ఇది కూడా మంచిదే. రానున్న రోజుల్లో వర్షాకాలం కావడం ఈ సంవత్సరం పంటలు బాగా పాండే అవకాశం ఉండడం. ప్రభుత్వాలు కూడా రైతులకి కనీస మద్దతు ధర ఇస్తాం అని ప్రకటించడం తో యువత అటు వైపుగా వెళ్తున్నారు.

వర్క్ ఫ్రొం హోమ్ చేస్తూ ఊర్లల్లో ఉండిపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా వ్యవసాయం వైపు ఇంటరెస్ట్ చూపిస్తుండడం విశేషం. రీసెంట్ గా జరిగిన ఒక సర్వే వివరాల ప్రకారం జాబ్ లెస్ యూత్ అంత వ్యవసాయం లో ఆధునిక విధానాన్ని ఉపయోగించి లాభ సాటిగా ఉండే కమర్షియల్ పంటల్ని ఎలా పండించాలి అనే దాని మీద ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వరి, గుధుమ లాంటి పంటల వైపు కాకుండా కమర్షియల్ క్రాప్స్ వైపు నడుస్తున్నారు.

ప్రతి సంవత్సరం 2000 మంది రైతులు వ్యవసాయం వదిలేసి పట్నాల్లో కార్మికులు గ చేస్తున్నారని ఒక సర్వే లో తేలింది. దీని ప్రకారం రానున్న రోజుల్లో తినే వాడు ఉంటాడు కానీ పండించే వాడు ఉండదు. కాబట్టి కచ్చితం గా పండించేవాడికి డిమాండ్ పెరుగుతుంది. అగ్రికల్చర్ BSC లాంటి కోర్స్ లు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాన్ని ఇచ్చే పోసిషన్ లో గవర్నమెంట్ లేదు. అలంటి వాళ్ళకి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఫెర్టిలైజర్స్, పెస్టిసిడ్స్ వంటి బిజినెస్ చేసుకోడానికి ఆస్కారం ఇవ్వాలి. ఐఏఎస్, IPS లాగ ఇండియన్ అగ్రికల్చర్ సర్వీసెస్ అనే కొత్త పరీక్షని పెట్టి వ్యవసాయానికి తోడ్పడాలని ప్రభుత్వం యోచిస్తుంది.

భారత్ జీడీపీ పడిపోవడానికి ముఖ్య కారణం కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఆగిపోవడమే. ఇక్కడ పండించే వాడు లేక, పండించిన కనీస గిట్టు బాటు ధర రాక వ్యవసాయం వొదిలేస్తున్నారు. దాని వాళ్ళ మన జనాభా కి సరిపోయే కొన్ని వస్తువులు వేరే దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ గ్యాప్ ని నింపడానికి యువత వ్యవసాయం వైపు అడుగు వేయాల్సిన పరిస్థితి ఉంది.

అమెరికా జీడీపీ కి కారణం టెక్నాలజీ. చైనా జీడీపీ కి కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదే విధం గా భారత్ బలం వ్యవసాయం. మనం దాన్ని మర్చిపోయి లేని వాటి వైపు పరుగులు తీస్తున్నాం. టెక్నాలజీ ని డెవలప్ చేయాల్సిన అవసరం కచ్చితం గా ఉంది కానీ ఒకప్పుడు లాభసాటి గా ఉండే వ్యవసాయాన్ని ఇప్పుడు నష్టాల్లో నెట్టడం తో భారత ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తినింది. కాబట్టి అటు వైపు మేధావులు, ప్రభుత్వాలు, ప్రజలు ఆలోచనలు చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పొలం లేని వాళ్ళకి వ్యవసాయం నేర్చుకునే అవకాశం తక్కువ. కానీ పొలాలు ఉన్న వాళ్ళు వ్యవసాయాన్ని నేర్చుకుని పెట్టుకుంటే ఒకవేళ మళ్ళి ఎప్పుడైనా ఇలా కరోనా లాంటి సంక్షోభాలు వచ్చి ఉద్యోగాలు పోయిన మన చేతిలో పని ఉంటుంది కాబట్టి ఉపయోగపడ్తుంది.

-KRISHNA (FRONTLINESMEDIA)

32051 COMMENTS

Popular Articles