ఇక జీవితాంతం వర్క్ ఫ్రొం హోమ్

0
1555
Work From Home

కొరోనా వైరస్ మనిషి కి చాల పాఠాలు నేర్పింది. కొంతమంది బ్రతుకులని ప్రశ్నర్థకం చేస్తే, కొందరికి బ్రతికే దారి చూపించింది. సామాన్య మధ్యతరగతి వాళ్ళని భారీ గా దెబ్బ కొట్టిన ఈ కొరోనా వైరస్. టెక్ రంగానికి సరికొత్త దారులు చూపిస్తుంది. ఇంట్లో లాప్ టాప్, చెవులకి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తమ ఊర్లల్లో తమ రూమ్ లో కూర్చుని పని చేసుకోడం సాధ్యమని నిరూపించింది. ఇప్పుడు ఇదే ట్రెండ్. ఇప్పుడే కాదు ఇక మీదట కూడా ఇదే జరగబోతుంది. ఇలా చెయ్యడం ద్వారా ఇటు పని చేసే ఉద్యోగులకి, అటు కంపెనీ యాజమాన్యానికి లాభసాటిగా కనిపిస్తుంది.

ఇప్పటికే డిసెంబర్ వరుకు ఎవరి ఇళ్లల్లో వాళ్ళని పని చేసుకోమని అన్ని కంపెనీ లు చెప్పేసాయి. సాఫ్ట్వేర్ రంగానికి ముఖ్య నగరాలైన హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లో రోజు కరోనా కేసులు సంఖ్య పెరిగిపోడం తో వర్క్ ఫ్రొం హోమ్ ఏ మంచిదని కంపెనీలు, ఉద్యోగులు భావిస్తున్నారు. ఇలా చెయ్యడం ద్వారా కంపెనీ లు చాలా లాభ పడ్తున్నాయి…ముఖ్యం గ ప్రతి నెలా కోట్లల్లో కరెంటు బిల్ కట్టే సాఫ్ట్వేర్ కంపెనీలకి ఆ భారం సగానికి పైగా తగ్గిపోయింది. ఫ్రీ గా కాఫీ, భోజనాలు అందించే సంస్థలకి ఇప్పుడు ఆ బాధలు లేవు. ఖర్చు లేకుండా తమకి కావాల్సిన పని ఉద్యోగులతో చేయించుకుంటూ ఏవ్ జీతాలు చెల్లిస్తూ సాఫ్ట్వేర్ కంపెనీ లు లాభాలు చూస్తున్నాయి..

ఇది ఇలా ఉంటే ఇంట్లో నే ఉంటూ అయిన వారికి దెగ్గర గా ఉంటూ సంపాదిస్తూ ఉండటం ఉద్యోగుల్లో కూడా ఉత్సాహాన్ని పెంచుతుంది. ఇప్పటికే గూగుల్ 2023 లోపు 50% ఉద్యోగులు పూర్తి గా వర్క్ ఫ్రొం హోమ్ చేసే లాగా ప్లాన్ చేస్తుంది. ఇదే బాట లో TCS, విప్రో, INFOSYS కూడా నడిచే అవకాశాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here