WILL OTT PLATFORMS TAKEOVER THEATRES

0
3175
OTT PLATFORMS: HOW DOES OTT PLATFORM WORK? (Amazon Prime, NetFlix, Zee5)

కరోనా కారణం గా భారీగా దెబ్బ తిన్న పరిశ్రమల్లో సినిమా ఒకటి. థియేటర్ ఓనర్ల దెగ్గర నుంచి యాక్టర్లు, చిన్న ఆర్టిస్టులు, సినెమాటోగ్రఫేర్లు, ఇలా అందరు ఆర్ధిక ఇబ్బంది ఎదురుకుంటున్నారు. వీళ్ళు తిరిగి గాడిలో పడాలంటే సినిమా థియేటర్లు తెరవడం మాత్రమే ఆధారం. ఇప్పటికే షూటింగ్లకి అనుమతి ఇచ్చేసింది బాలీవుడ్. అదే కోవ టాలీవుడ్ లో కూడా షూటింగ్ సందడి మొదలవనుంది. అయితే ఈ షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు ప్రజల ముందుకు రావాలంటే ఉండే థియేటర్లు తెరవాల్సిందే.

ఈ మధ్య వస్తున్నా అమెజాన్, ఆహ, జీ 5, నెట్ఫ్లిక్ వంటి OTT ప్లాటుఫార్మ్స్ లో చిన్న సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి. అదే దారి లో నడవాలని కొన్ని పెద్ద సినిమాలు కూడా అనుకున్నట్లు సమాచారం. నిశ్శబ్దం, రెడ్ వంటి పెద్ద సినిమా లు OTT దారి పట్టబోతున్నాయి అని న్యూస్ వస్తుంది. దీనితో అసల థియేటర్ల పని అయిపోయింది అనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై OTT ప్లాటుఫామ్లు ప్రొడ్యూసర్ల కి లాభాలని ఇస్తున్నాయా అనే అనుమానం చాల మందికి ఉండచ్చు. ఇదే విషయమై చెన్నై కి చెందిన QUBE సంస్థ MD స్పందించారు. అయన చెప్పిన దాని ప్రకారం OTT ప్లాటుఫామ్లు ప్రొడ్యూసర్ కి సినిమా తీయడానికి అయిన ఖర్చు కాకుండా ఇంకొక 15% మాత్రమే చెల్లిస్తున్నాయి. చిన్న సినిమాలకి ఇది లాభసాటిగా ఉన్నా వందల కోట్ల బిజినెస్ చేసే పెద్ద సినిమాలకి ఇది ఏమాత్రం సరిపోదు.

ఒక సినిమా బ్లాక్బస్టర్ అయినా, ప్లాప్ అయినా వాళ్ళకి ఆ 15% మాత్రమే వస్తుంది. అందుకే ప్రొడ్యూసర్లు థియేటర్ రిలీజ్ ల కోసమే ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. ఆగస్టు రెండో వారం లో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉండటం తో పాత సినిమాలే తిరిగి వేసుకోవాలని, పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి రద్దీ పెరిగే లోపు థియేటర్ ని కరోనా గైడ్లైన్స్ అనుగుణం గా మార్పులు చేసుకోవాలని ఆలోచిస్తున్నారు థియేటర్ యాజమాన్యాలు. దీపావళి నాటికి పెద్ద సినిమాలు రిలీజ్ ఉండటం తో మళ్ళి థియేటర్లు కళకళలాడిపోతాయి అని థియేటర్ యాజమాన్యాలు, సినిమా పెద్దలు ఆశిస్తున్నారు.

మనకి కూడా సినిమా థియేటర్ల లో చుస్తే వచ్చే కిక్ OTT లో చుస్తే రాదు.

-KRISHNA (FRONTLINESMEDIA)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here