చైనా లో మరో వైరస్: ప్లేగు వ్యాధి

0
1698
plague china rat virus
A rat surprised to see a human so close.

కరోనా వైరస్ వ్యాప్తి కి కారణం అయిన చైనా నుంచి ఇంకా ఆ వైరస్ కి వాక్సిన్ రాకముందే ఇంకొక వైరస్ పుట్టుకొచ్చింది. అదే కొన్ని ఏళ్ళ క్రితం ఇండియా ని అతలాకుతలం చేసిన ప్లేగ్ వ్యాధి. నార్త్ చైనా లో ని ప్రావిన్స్ లో ఈ ప్లేగ్ వ్యాధి బయట పడింది. దీనితో అక్కడ ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించారు. కొరోనా లాగ ప్లేగ్ వ్యాధి 14 రోజులు ఇబ్బంది పెట్టి తగ్గిపోయే రకం కాదు. ఆ వ్యాధి వస్తే 45-72 గంటల్లో మనిషి చనిపోయే అవకాశాలు ఉన్నాయి.

ఎలుకలు, పందికొక్కులు ఆ జాతికి చెందిన జంతువుల్లో ఈ ప్లేగ్ వ్యాధి ఉంటుంది. వాటిని తినడం ద్వారా ఈ వ్యాధి మనిషి లో కి పాకుతుంది. సాధారణం గ ఈ ప్లేగ్ వ్యాధి 3 రకాలు. ఒకటి బుబోనిక్ ప్లేగ్, నిమోనిక్ ప్లేగ్, సెప్టిసీమిక్ ప్లేగ్. ఇప్పుడు చైనా లో వచ్చింది బుబోనిక్ ప్లేగ్. ఒక మనిషి ఆ ఎలుక జాతి జంతువుని తినడం ద్వారా ఈ వ్యాధి అతని శరీరం లో కి పాకింది.

ఈ బుబోనిక్ ప్లేగ్ వాళ్ళ మనిషి శరీరం మీద చిన్న చిన్న గడ్డలు ఏర్పడుతాయి. మెల్లగా అందులో నుంచి నొప్పి, చీము కారి లోపల అవయవాల పని తీరుని దెబ్బ తీస్తాయి. నిమోనిక్ ప్లేగ్ వచ్చిన వ్యక్తి వెంటనే చనిపోయే అవకాశం ఎక్కువ ఎందుకంటే అది ఊపిరితిత్తుల మీద దెబ్బ కొడ్తుంది. కానీ బుబోనిక్ ప్లేగ్ మెల్లగా శరీరం మొత్తం పాకి ఇమ్యూన్ సిస్టం ని దెబ్బ తీస్తుంది. బుబోనిక్ ప్లేగ్ లో జబ్బుని వెంటనే కనిపెట్టగలిగితే మనిషి ప్రాణాలని కాపాడే అవకాశం ఉంది. కానీ నేపోనిక్ ప్లేగ్ స్పెటోనిక్ ప్లేగ్ లో జబ్బు కనిపెట్టిన రోజుల వ్యవధి లో నే మనిషి చనిపోతాడు.

భారత్ లో 18వ శతాబ్దం లో ఈ ప్లగ్ వ్యాధి ప్రబలింది. అప్పుడు దాదాపు 12 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆ వైరస్ చైనా నుంచి ఇండియా వస్తే అది తట్టుకునే శక్తి ఇండియా కి లేదు. కాబట్టి చైనా లో నే దాన్ని అంతం చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-KRISHNA (Chief Editor (FLM))

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here