FrontLines Media

అనంత పద్మనాభ స్వామి గుడి హిస్టరీ

sree padamanabhaswamy temple

కేరళ లో ని అనంత పద్మనాభ స్వామి గుడి మనందరికీ తెలిసిందే. 108 విష్ణు క్షేత్రాల్లో అతి ప్రాముఖ్యమైన పుణ్య క్షేత్రం ఇది. కొన్ని వేళా సంవత్సరాల క్రితం రాసిన బ్రహ్మ పురాణం, మత్స్య పురాణం, భాగవత పురాణాల్లో ఈ గుడి గురించి రాసి ఉంది. దాని ద్వారా ఈ గుడి అతి ప్రాచీనమైనది చెప్పవచ్చు. తర తరాల గా ఈ గుడి ట్రావెన్కోర్ సంస్థానం అధీనం లో ఉండేది. ఈ గుడి లో ఉన్న గదులలో కొన్ని వేల కోట్ల నిధులు ఉన్నాయని కొన్ని యుగాలుగా జనాలు నమ్ముతూ ఉంటారు. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ 2011 లో బయట పడిన బంగారం, వెండి ఆభరణాల తో ఈ నమ్మకం ఇంకాస్త నిజం అయినట్లు అయ్యింది.

ఈ గుడి లో మొత్తం 6 గదులు ఉన్నట్లు నమ్ముతున్నారు. ఆ గదులకు నాగ బంధం వేసి ఉంటుంది అని చరిత్ర పురాణం లో రాసి ఉంది. గుడి యొక్క 6వ గదిలోనే ఈ నిధులు ఉన్నాయ్ అని నమ్ముతారు. 2011 లో బయట పడ్డ బంగారం వల్ల ఈ నమ్మకం బలం గా మారి, చాలా మంది ఆ గదులు తెరవాలని, అందులో ఎం ఉందొ చూడాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. 2011 లో బయట పడిన నిధి విలువ $1 ట్రిలియన్ డాలర్స్ గా అప్పటి ప్రభుత్వం తేల్చింది. అందువల్లే, సుప్రీమ్ కోర్ట్ ఆ గుడిని కేరళ ప్రభుత్వం అధీనం లో కి తీసుకోవాలని తీర్పుని ఇచ్చింది. అప్పటి నుంచి, ట్రావెన్కోర్ సంస్థానం ఆ గుడి మీద హక్కులు కోల్పోయింది.

ట్రావెన్కోర్ సంస్థానానికి విధేయులు అయిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ట్రావెన్కోర్ సంస్థాన పెద్దలు, గుడి మీద సర్వ హక్కులు వాళ్ళకే చెందాలని, కోర్ట్ లో కేసు వేశారు. అప్పటి నుంచి నడుస్తూవస్తున్న ఈ కేసు కి ఈ మధ్యే తీర్పు ని ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం అనంత పాదనాభ స్వామి గుడి సర్వ హక్కులు ట్రావెన్కోర్ సంస్థాన ప్రస్తుత వారసులకు చెందాలని, గుడి లో ఉన్న గదుల విషయం పూర్తిగా ప్రజలు, భక్తుల నమ్మకాల మీద ఆధార పడి నిర్ణయం తీసుకోవాలని కోర్ట్ నిర్ణయం తీసుకుంది.

-Krishna (FrontlinesMedia)

Exit mobile version